ఇద్దరు మిలీషియా సభ్యులు సహా..

Thu,December 5, 2019 04:13 AM

ఒక మావోయిస్టు కొరియర్ అరెస్ట్
భద్రాచలం, నమస్తే తెలంగాణ : చర్ల మండలం తాలిపేరు డ్యామ్ సమీపంలో సంచరిస్తున్న ఇరువురు మావోయిస్టు మిలీషియా సభ్యులతో పాటు ఒక కొరియర్‌ను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. బుధవారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ర్టాల గ్రామమైన పుట్టపాడు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు పోలీస్‌ల కదలికలను లక్ష్యంగా చేసుకొని పోలీస్‌లను నష్టపరచాలని వ్యూహం పన్నినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్, దామోదర్, రాజిరెడ్డి, శారద, ఆజాద్, భద్రు, సోడె, జోగయ్య, దీప్, రజిత, మధులు కలిసి సమావేశమై పోలీసులను, రాజకీయ నాయకులను చంపాలని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కుట్ర పన్నినట్లు వెల్లడించారు. బుధవారం చర్ల మండలం తాలిపేరు డ్యామ్ సమీపంలో మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు పొడియం ఈడమయ్య, వంజం మాసలు 30 జిలిటియన్ స్టిక్స్, 12 డిటోనేటర్స్‌ను మావోయిస్టు పార్టీ నాయకుడైన లచ్చన్న కొరియర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. పండా కృష్ణమూర్తి అనే కొరియర్‌కు మిలీషియా సభ్యులు పొడియం ఇడమయ్య, వంజం మాసలు ఇస్తుండగా, అదే సమయంలో ముందస్తు సమాచారం మేరకు వారిని వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు.

పట్టుబడిన వారిలో మావోయిస్టు మిలీషియా సభ్యులైన పొడెం విరమయ్యది చర్ల మండలం ఎర్రంపాడు గ్రామం అని, కుంజం మాసది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చిన్న కేడిపాయి అనే గ్రామం అని, కొరియర్ పండా కృష్ణమూర్తిది చర్ల మండలం పూసుగుప్ప గ్రామం అని పేర్కొన్నారు. పట్టుబడిన మిలీషియా సభ్యుడైన పొడియం ఇడమయ్య 12 కేసుల్లో కీలక సూత్రదారి, పాత్రదారి అని ఏఎస్పీ పేర్కొన్నారు. ఇడమయ్యపై చర్ల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. 2017 సంవత్సరంలో ప్రసాద్ హత్యకేసు, 2018లో అంజనాపురం మైన్ కేసు, భారత్ హత్యకేసు, తిప్పాపురంలో మైన్ కేసు, పగిడివాగు మైన్ కేసులో ఇడమయ్య ఉన్నాడని తెలిపారు. 2018లో ఆర్‌అండ్‌బీ కల్వర్ట్ బాంబ్ బ్లాస్టింగ్ కేసులో ఆర్‌టీసీ బస్టాండ్ మైన్ కేసు, కుర్ణపల్లి హత్యకేసు, బోదనెల్లి బ్లాస్టింగ్ కేసు, 2019లో పెద్దమిడిసిలేరు మైన్ కేసులో ఇడమయ్య సూత్రధారిగా ఉన్నాడన్నారు.

262
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles