7న ఖమ్మంలో వెంకీమామా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

Tue,December 3, 2019 11:56 PM

-లేక్‌వ్యూ క్లబ్‌కు రానున్న హీరోలు వెంకటేష్‌, నాగచైతన్య
మయూరిసెంటర్‌:కళలకు గుమ్మమైన ఖమ్మంలో అగ్రతారలు సందడి చేయను న్నారు. మెట్రోపాలిటన్‌ నగరాలకు దీటుగా పర్యాటక రంగాన్ని తలదన్నేలా ఖమ్మం నగర నడిబొడ్డున్న ఉన్న లేక్‌వ్యూ క్లబ్‌ (సీక్వెల్‌ రిసా ర్ట్స్‌)కు శనివారం వెంకీమామా చిత్రం యూనిట్‌ రానుంది. ఈ సందర్భంగా లేక్‌వ్యూ క్లబ్‌ అధ్యక్షుడు దొడ్డా రవి మాట్లాడు తూ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, జైలవకుశ వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు కే రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో స్టార్‌ హీరోలు దగ్గుపాటి వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్యలు నటించిన వెంకీమామా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఖమ్మం లేక్‌వ్యూ క్లబ్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిరోయిన్లు రాశిఖన్నా, పాయల రాజ్‌ పుట్‌తో పా టు సంగీత దర్శకుడు థమన్‌ స్పెషల్‌ లైవ్‌ మ్యూజిక్‌ హైలెట్‌గా ఉండబోతుందన్నారు. వీటితో పాటు జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది కూడా అలరించబోతున్నట్లు తెలిపారు. బిగ్‌బాస్‌ రన్నర్‌ అప్‌ శ్రీముఖీ యాంకర్‌గా ఈవెంట్‌ జరగబోతుందన్నారు. వెయ్యి కి పైగా సినిమా ఈవెం ట్స్‌తో దక్షిణ భారత దేశంలో నెంబర్‌ వన్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెం ట్‌ కంపెనీ శ్రే యాస్‌ మీడియా ఈ వేడుకను నిర్వహిస్తోంది.ఈ కలర్‌ఫుల్‌ ఈవెంట్‌కి సంబంధించిన ఎం ట్రీ పాసు ల కోసం శ్రేయాస్‌ ఈటీ యాప్‌ డౌ న్లోడ్‌ చేసుకొని బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

281
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles