ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

Tue,December 3, 2019 12:39 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా ముందస్తు ఏర్పాట్లతో రైతులు అగ్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ హన్మంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యంతో పాటు తమ కళ్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్ఫాలిన్‌లను సమకూర్చుకోవాలని, ఒక వేల ధాన్యం తడిసిన యెడల మరలా ధాన్యాన్ని ఆరబెట్టాలని ఆయన రైతులకు సూచించారు. ఒకవేళ తడిసినా ధాన్యం కొనుగోలులో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నియమ నిబంధనల మేరకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా రాబోయే రెండు మూడు రోజులు వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జేసీ హన్మతు కొడింబాకోరారు.

202
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles