పెద్దమ్మ గుడికి పోటెత్తిన భక్తులు..

Sun,December 1, 2019 11:49 PM

పాల్వంచ, డిసెంబర్‌1: మండలంలోని జగన్నాథపురం-కేశవాపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారు (పెద్దమ్మగుడి) దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడి పోయింది. ఉమ్మడి జిల్లాతో పాటుగా పక్క జిల్లా నుంచి కూడా భక్తులు అత్యదిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. చల్లగా చూడాల భక్తులు అమ్మవారికి భోనాలు సమర్పించుకున్నారు. అలాగే ఆన్న ప్రాసనలు, నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు, తలనీలాలు, అమ్మవారికి బడి బియ్యం, చీరలు తదితర మొక్కులను భక్తులు చెల్లించుకున్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం నిండి పోయింది. దేవాలయానికి సంబంధించిన గదులు సరిపడక పోవడంతో భక్తులు చెట్టకింద వంటావార్పు చేసుకున్నారు. జాతీయ రహదారి పక్కను దేవాలయం ఉండటంతో ట్రాపిక్‌ సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

12వ తేదీన చంఢీ హోమం
దేవాలయంలో ఈనెల 12వ తేదీన చంఢీహోమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎన్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హోమంలో పాల్గొనే భక్తులకు కష్టాలు, దారిద్య్రం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో చంఢీహోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

194
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles