పులిపాటికి గవర్నర్ల పురస్కారం..

Sun,December 1, 2019 11:49 PM

-మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాల వేడుకల్లో దక్కిన అరుదైన గౌరవం
మయూరి సెంటర్‌ : ప్రముఖ విద్యావేత్త, మహాత్మా గాంధీ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పులిపాటి ప్రసాద్‌కు శనివారం రాత్రి హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ర్టాల గవర్నర్లు డాక్టర్‌ తమిళసై సౌందర రాజన్‌, బండారు దత్తాత్రేయల చేతుల మీదుగా మహాత్మాగాంధీ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఖమ్మం జిల్లా వాసి, విద్యావేత్త పులిపాటి అందిస్తున్న సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి సేవా తత్పరతో పలు అవార్డులు పొందిన ఆయనకు రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు గవర్నర్ల చేతుల మీదుగా పురస్కారం దక్కడం జిల్లాకు గర్వకారణం.

రాజకీయాలకు అతీతంగా కుల, మత, వర్గ, వర్ణ బేధాల ఊసే లేకుండా సేవా కార్యక్రమాలు గాంధీజీ సిద్ధాంతాలు, ఆయన ఆశయాలను విద్యార్థుల ద్వారా ప్రజలకు అవగాహనను కల్పించి, మాహాత్మా బాపూజీ విగ్రహాన్ని తన కళాశాల ఎదుట ఏర్పాటు చేసి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య సమక్షంలో ఖమ్మంలో విష్కరింప చేసి సామాజిక సేవలను ముమ్మరం చేసిన ఆయనకు అరుదైన గౌరవం లభించింది. ఈ పురస్కారం దక్కడం పట్ల రాష్ట్ర విత్తానాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్‌ పాపాలాల్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎండీ ఖమర్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, రాష్ట్ర నర్సింగ్‌ కళాశాలల అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, ప్రతాపనేని నర్సింహ్మారావు, బీ లక్ష్మీనారాయణలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

182
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles