చేపల ఉత్పత్తితో అధిక లాభాలు

Sun,December 1, 2019 11:48 PM

కూసుమంచి, డిసెంబర్‌1: చేపలు, రొయ్యలతో పాటు, కూరగాయలు, తేనెటీగలు, కోళ్ల పెంపకం చేపడితే అధికలాభాలు గడించవచ్చని వైఎస్సార్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఏ దేవీవరప్రసాద్‌రెడ్డి అన్నారు. పాలేరు మత్స్య పరిశోధనకేంద్రంలో నెలరోజుల శిక్షణకు హాజరైన ఎనిమిది రాష్ర్టాలకు చెందిన 35 మంది ప్రతినిధులను శిక్షణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా భీమవరం, వెంకట్రామన్నగూడెంలలో గల చేపలు, రొయ్యల చెరువులు, ఆక్వావన్‌ సెంటర్లు, చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు, కూరగాయలు, కోళ్లు, అజల్లా, తేనెటీగల పెంపకం కేంద్రాలను పరిశీలించారు. వీటిపనితీరు గురించి, దేవీవరప్రసాద్‌రెడ్డి వివరించారు.

కోళ్ల పెంటను ఎరువుగా ఉపయోగించి కూరగాయల సాగు, ఆహారంగా ఉపయోగించి చేపల పెంపకం చేసే విధానాన్ని తెలిపారు. వైఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయం ఆవరణలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెంట్‌ కేంద్రాన్ని కూడా వారు పరిశీలించారు. అక్కడ చేపట్టిన బంతిపూలు, చామంతి, మిర్చి, టమాట, వంకాయ తోటలను చూపి, వాటిసాగు విధానాన్ని వివరించారు. భీమవరంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి రొయ్యల చెరువును సందర్శించి, అక్కడ అవలంభిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, పెంపకం, వ్యాధుల నివారణ, దిగుబడి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. లహరి, భారతి అనే యువతులు నిర్వహిస్తున్న ఆక్వాల్యాబ్‌ను సందర్శించి, వివరాలను సేకరించారు. ఈకార్యక్రమాన్ని పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు జీ.విద్యాసాగర్‌రెడ్డి, పీ.శాంతన్న తదితరులు పర్యవేక్షించారు.

178
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles