పెంపకానికి అనువైన చేపలను ఎంచుకోవాలి

Thu,November 21, 2019 12:53 AM

కూసుమంచి, నవంబర్‌ 20: మత్స్య రైతులు తమ ప్రాంతంలో నీటి లభ్యత, లవణాలు తదితర అంశాల ఆధారంగా పెంపకానికి అనుకూలమైన చేప రకాలను ఎంపిక చేసుకోవాలని విజయవాడకు చెందిన జాతీయ మంచినీటి చేపల సాగు సంస్థ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రమేష్‌రాథోడ్‌ సూచించారు. పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో ఎనిమిది రాష్ర్టాలకు చెందిన 35 మంది ప్రతినిధులకు ఇస్తున్న శిక్షణను బుధవారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. చేపల చెరువుల్లో నీటి నాణ్యత, గాఢత, ఉదజని, క్షారాలు, ఆక్సిజన్‌, నేల స్వభావం కీలకమైనవని, ఇవన్నీ తగు మోతాదులో ఉంటే చేపల వ్యాధులు అంతగా సోకకుండా బతుకుదల శాతం పెరుగుతుందని చెప్పారు. జమ్మికుంట కేవీకే మత్స్యశాస్త్రవేత్త జీ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. చేపల పెంపకంలో ఎదురయ్యే అవరోధాలు, వాటి నివారణచర్యలను వివరించారు. ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తుందని తెలిపారు. మరో శాస్త్రవేత్త దేవానంద్‌ చేపల బాహ్య, అంతర అవయవాలు, వాటికి సంక్రమించే వ్యాధులను గుర్తించే విధానాలను వివరించారు. స్థానిక మత్స్య శాస్త్రవేత్తలు జీ విద్యాసాగర్‌రెడ్డి, పీ శాంతన్న క్షేత్రస్థాయిలో చేపల బరువు పరిశీలన, వ్యాధుల గుర్తింపు,మేతలు అందించే విధానాన్ని వివరించారు.

228
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles