ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి

Thu,November 21, 2019 12:53 AM

-జిల్లా వైధ్యాధికారి డాక్టర్‌ బీ కళావతిబాయి
రఘునాథపాలెం, నవంబర్‌20: విధి నిర్వహణలో ఉద్యోగులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, పని వేళల్లో సమయ పాలన తప్పక పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బీకళావతిబాయి ఆదేశించారు. బుధవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని ఎంసీహెచ్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కొందరు ఉద్యోగులు సక్రమంగా హాజరుకాకపోవడం పట్ల ఆగ్రహానికి గురయ్యారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంలో భాగంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్యన్ని కాపాడటానికి కేంద్రం ఉన్నదని, విధుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. (0-18) సంవత్సరాల పిల్లల్లో రుగ్మతలు తగ్గించే రిహ్యాబిటేషన్‌ సెంటర్‌లో చిన్న పిల్లల డాక్టర్‌, మేనేజర్‌, వైద్యాధికారి, సైకాలజిస్ట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని త్వరలో కలెక్టర్‌ ఆదేశానుసారం నియామకాలను చేపట్టినునట్లు ఆమె తెలిపారు. అనంతరం ఎన్‌ఆర్‌సీ సెంటర్‌ను సందర్శించి పిల్లలు తక్కువగా ఉన్నారని, ఉన్న పిల్లల్లో పెరుగుదల లేకపోవడాన్ని గ్రంహించి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అలివేలు, ఫార్మసి సూపర్‌వైజర్‌ నాగమని, సిబ్బంది పాల్గొన్నారు.

192
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles