వాయు కాలుష్య నియంత్రణలో..తెలంగాణ దేశానికే ఆదర్శం

Wed,November 20, 2019 01:17 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మంగళవారం లోక్‌సభ రూల్ 193 కింద ప్రవేశపెట్టిన వాయు కాలుష్యం, వాతావరణ మార్పులుపై మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నా సహాచరులు చాలా మంది ఈ విషయమై మాట్లాడం జరిగింది. ప్రపంచ వాయు కాలుష్యం అగ్రభాగాన ఉన్న పది పట్టణ ప్రాంతాల్లో 9 కాలుష్య నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. అలాగే ప్రపంచంలో 20 వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉన్నా నగరాల్లో 15 మన దేశంలోనే ఉన్నాయన్నారు. మనందరం భారతీయులం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హరియాణ ఏ రాష్ట్రం అయిన వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు విషయమై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయం ఎందుకు చెబుతున్నాంమంటే నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, వాహన కాలుష్యాలతో మన దేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటమే కాక మన జీవన విధానం పైన, దేశ ఆర్థిక పరిస్థితులు పైన తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కాలుష్య విషయమై ప్రధానమంత్రి వాతావరణ మార్పు మండలి ఏర్పాటు అయి కొన్ని విషయాలను గుర్తించడం జరిగిందని తెలిపారని, వాటిలో నీరు, వ్యవసాయం వంటి పలు విషయాలను పొందుపర్చారు. ఈ విధంగా జాతీయస్థాయిలో వాతావరణ మార్పులుపై మండలి ఏర్పాటు అయినప్పటికి ఎందుకు పూర్తిస్థాయిలో నియంత్రణ చేయలేకపోతున్నారని నామా ప్రశ్నించారు. మలేషియా నుంచి నాకు తెలిసిన వ్యక్తి నన్ను కలవాలి అన్నారు. నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఢిల్లీ రండి ఇక్కడ కలుద్దాం అంటే ఇటీవల ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నదని మీడియాలో వచ్చింది. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామని అన్నారు. అంటే విదేశీయుల కూడా రావాలంటే బయపడుతున్నారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ.. ఈ వాయు కాలుష్యం విషయమై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చేయమన్నారు.

మేము టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఈ విషయంర్ల కొన్ని సూచనలు చేయాలని అనుకుంటున్నాం వాటిని పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని నామా అన్నారు. మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గత ఐదేండ్లలో హరితహారం కింద సుమారు 176 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. విశేషం ఏమిటంటే మన దేశ జనాభా 135 కోట్లు ఉంటే అంతకు మించి మొక్కలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నాటడం జరిగిందన్నారు. అలాగే నూతన గ్రామ పంచాయతీ చట్టం ద్వారా ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఉండాలనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, అటవీ భూములులో 77 అర్బన్ పార్క్‌లను తెలంగాణలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు మన దేశంలో ఏ రాష్ట్రం ఈ విధంగా చేసి ఉండదు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. నా స్వంత పార్లమెంట్ నియోజకవర్గం, ఖమ్మం పట్టణ పరిధిలో వెలుగుమట్ల పార్క్‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కోతుల బెడదను అరికట్టడానికి వాటి కోసం ప్రత్యేక పార్క్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గతంలో ఉన్న దాని కంటే అదనంగా 3 శాతం అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం జరిగిందని ఎంపీ నామా తన ప్రసంగంలో పేర్కొన్నారు.

249
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles