తాత్కాలిక కండక్టర్లపై ఆర్టీసీ కండక్టర్ల దాడిమ

Sun,November 17, 2019 12:27 AM

ణుగూరు రూరల్: మణుగూరు ఆర్టీసీ డిపోలో శనివారం ఆర్టీసీ మహిళ కండక్టర్లు వీరంగం సృష్టించారు. ఒక్కసారిగా అంతా పోలీసులను దాటుకుని డిపోలకి ప్రవేశించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రైవేట్ కండక్టర్లను చితక బాదారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న డిపో ఆవరణలో ఒక్కసారిగా ఉధృక్త వాతావరణం నెలకొన్నది. ఆర్టీసీ కండక్టర్లతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ప్రైవేట్ కండక్టర్లపై దాడి చేశారు. దీంతో కొంతమంది కండక్లర్లు భయంతో డిపో వెనుక గోడదూకి పారిపోయారు. ఈ దాడిలో ప్రైవేట్ మెకానిక్ కనకరాజు మెడపై గాయాలయ్యాయి. అతనిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి స్కానింగ్‌ల నిమిత్తం భద్రాచలం తరలించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని బయటకు పంపారు.

242
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles