అనుమతి లేని పాదయాత్రకు పోలీసుల బ్రేక్

Sat,November 16, 2019 12:30 AM

ముదిగొండ: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం పాదయాత్ర చేస్తున్న అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నేలకొండపల్లికి చెందిన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఎమ్మార్పీఎస్, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు తమ సిద్ధాంతాలు విస్మరించి ఆర్టీసీ సమ్మెకు మద్దతు పేరుతో అఖిలపక్షంగా ఏర్పడి ముందస్తు అనుమతులు లేకుండా ఖమ్మం బస్‌డిపో ముట్టడించేందుకు నేలకొండపల్లి నుంచి పాదయాత్రగా బయల్దేరారు. ఈ నేపధ్యంలో పాదయాత్ర బృందం ముదిగొండకు చేరుకోగానే ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐ మహేశ్ ప్రత్యేక చొరవ తీసుకొని నాయకుల వద్దకు వెళ్లి పాదయాత్రకు అనుమతులు లేనందున విరమించుకోవాలని నచ్చచెప్పారు. అయినా పోలీసులను ఖాతరు చేయకుండా పాదయాత్రను ముదిగొండ పారిశ్రామిక ప్రాంతం వరకూ కొనసాగించటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా పాదయాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా సీఐ పర్యవేక్షణలో ఎస్‌ఐ భారీగా సిబ్బందిని మోహరించారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ సీఐ విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా పాదయాత్రలు చేస్తుండటంతో 40మంది వివిధ పార్టీలకు చెందిన ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

238
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles