బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దాం

Fri,November 15, 2019 12:42 AM

-బాలల దినోత్సవ వేడుకల్లో జడ్పీ చైర్మన్ కమల్‌రాజు
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 14: సురక్షిత బాల్యం కోసం ప్రతీ ఒక్కరు పాటు పడాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని గురువారం నగరం లోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత అడిషనల్ డీసీపీఓ ఇతర మహిళా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డీడబ్యూఓ ఎం సబిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్, ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీసీపీ పూజ, డీఎల్‌సీఎ కార్యదర్శి వినోద్‌కుమార్ మాట్లాడారు. సురక్షిత బాల్యం కోసం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు చొరవ తీసుకోవాలని వారు సూచించారు. బాల్యం పిల్లల ప్రాథమిక హక్కు అని అలాంటి హక్కు హరించకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం విద్యావకాశాలు అనేకం ఉన్నాయన్నారు.

చిన్నారులకు నాణ్యమైన విద్య అందిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయ పడ్డారు. బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, బాలికల అక్రమ రవాణ నిర్మూలను పాటు పడాలని వారు పేర్కొన్నారు. అనంతరం బాలలకు సంబంధించిన ఉచిత నిర్భంద విద్యాహక్కు, బాల్య వివాహ నిరోధక చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం తదితర చట్టాలపై వక్తలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్‌ఓ కళావతి, ఎంఎల్ ప్రసాద్, నరేంద్ర స్వరూప్, కూరపాటి ప్రదీప్, డీసీపీఓ టీ విష్ణువందనతో పాటు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పాఠశాలల, కళాశాలల విధ్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

280
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles