సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి..

Wed,November 13, 2019 11:59 PM

-ఖమ్మం జిల్లా సైన్స్ అధికారి బీ సైదులు
వైరా, నమస్తే తెలంగాణ : విద్యార్థులు సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా సైన్స్ అధికారి బి.సైదులు అ న్నారు. వైరాలోని టీఎస్‌ఆర్‌ఎస్ పాఠశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి సైన్స్ డ్రా మా ఫెస్టివల్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి బీ సైదులు ముఖ్య అతిథిగా హాజరై ఫెస్టివల్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ సుజాత అధ్యక్షతన జరిగిన సభలో సైదులు మాట్లాడుతూ మానవుని నిత్య జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. సైన్స్ పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహి స్తారని చెప్పారు. విద్యార్థులు నేర్చుకున్న సైన్స్ పరిజ్ఞానాన్ని తమ గ్రామాల్లోని ప్రజలకు వివరించాలన్నారు. సైన్స్ పరిజ్ఞానం వ్యాప్తి చెందినప్పుడే మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. నేటి ఆధునిక సమాజంలో అంతరిక్షం పైకి మానవుడు వెళుతున్న సమయంలో ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసించడం దురదృష్టకరమన్నారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 9 బృందాలు సైన్స్ డ్రామా ఫెస్టివల్‌లో తమ ప్రదర్శనలు ఇచ్చాయి. ఈ ఫెస్టివల్‌లో ఖమ్మానికి చెందిన ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్ విద్యార్థులు ప్రథమ, రెబ్బవరానికి చెందిన మహత్మాజ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు ద్వితీయ బహుమతిని, టీఎస్‌ఆర్‌ఎస్ విద్యార్థినులు తృతీయ బహుమతిని సాధించారు. విజేతలు ఈ నెల21వ తేదీన హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు. విజేతలకు ఎస్‌ఎంసీ చైర్మన్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, ప్రిన్సి పాల్ సుజాత బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా యు.ఉమా సుందరి, జి.సుధాకర్, కేవీ రత్నమాల వ్యవహరించారు.

259
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles