ముగిసిన ఎద్దుల బలప్రదర్శన పోటీలు

Wed,November 13, 2019 11:58 PM

నేలకొండపల్లి, నవంబర్ 13:రాజేశ్వరపురం గ్రామం లో మూడు రోజులుగా నిర్వహించిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ముగియడంతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ పోటీలకు తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు ఏపీలోని ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎద్దులు తరలివచ్చాయి. ముగింపు సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ కూడా కొద్దిసేపు పోటీలను తిలకించారు. పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు నగదు బహుమతులను అందించారు. కృష్ణా జిల్లాకు చెందిన సుబ్బారావుకు చెందిన ఎడ్ల జతకు ప్రథమస్థానం, విజయవాడకు చెందిన మేకా కృష్ణకు చెందిన ఎడ్ల జత రెండో, ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఎడ్ల జత మూడో స్థానం, బీమవరానికి చెందిన టీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా వారి ఎడ్ల జత నాల్గవ స్థానం, ఐదో స్థానంలో మాచవరానికి చెందిన వెంకటేశ్వరరావు ఎడ్ల జత, ఆరోస్థానంలో సుంకి సురేందర్‌రెడ్డి ఎడ్ల జత, ఏడో స్థానంలో రాజలింగాలు చెందిన యంవీఆర్ మెమోరియల్ ఎడ్ల జత, ఎనిమిదో స్థానంలో పెనమలూరుకు చెందిన శ్రీధర్‌లకు చెందిన ఎడ్ల జతలు బహుమతులను గెల్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మీ, ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్ దండా పుల్లయ్య, ఎంపీటీసీ జటంగి చంద్రమ్మ, సొసైటీ చైర్మన్ దండా ప్రవీణ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య, ప్రధానకార్యదర్శి వెన్నబోయిన శ్రీనివాస రావు, జిల్లా నాయకులు కోటి సైదారెడ్డి, కొడాలి గోవిందరావు, బల ప్రదర్శన నిర్వహించిన సభ్యులు పాల్గొన్నారు.

282
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles