నిందితులకు ఆరు నెలల జైలు

Wed,November 13, 2019 11:57 PM

ఖమ్మం లీగల్: నారాయణ పురం గ్రామం సూర్యపేట జిల్లాలకు చెందిన నిందితులు దేశినేని మహేష్, షేక్ జానీపాషాలకు ఒంటరి మహిళల మెడల్లో బంగారు గొలుసులు దొంగతనం చేసిన మొత్తం 5 కేసుల్లో ఒక్కొక్క కేసులో 6 నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ బుధవారం తీర్పుచెప్పారు. కేసు వివరాల ప్రకారం ఫిర్యాది కోయ వెంకటేశ్వర్లు ఖమ్మం నగరంలోని బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్నాడు. తమ పిల్లలను బ్యాంకు కాలనీలోని వీ.వీ.సీ స్కూలు నుంచి రోజూ ఫిర్యాది భార్య తీసుకొని వచ్చేది. ఈ క్రమంలో నిందితులు మోటరు సైకిళ్లపై వచ్చి ఫిర్యాది భార్య మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. ఖమ్మం రెండో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి కోర్టులో ఛార్జ్జిషీట్ దాఖలు చేశారు. అదే విధంగా బురాహన్‌పురం, ఇంకా 3 చోట్ల ఇదే విధంగా దొంగతనం చేయడంతో పోలీసులకు ఫిర్యాదులు చేయగా, కోర్టులో నిందితులపై చార్జీషీట్ వేశారు. కేసు పూర్వాపరాలను ఇరుపక్షాల వాదనలు విన్న ఖమ్మం మొదటి అదనపు ఫస్ట్‌క్లాస్ న్యాయమూర్తి నిందితులకు ఒక్కొక్క కేసులో 6 నెలల జైలు శిక్ష విధించారు. ఈ తీర్పుపై నిందితులు అప్పీలు చేసుకోగా, బుధవారం ఈ కేసులలో కింది కోర్టు తీర్పును ధ్రువీకరిస్తూ న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేణిగుంట్ల ఉపేందర్ వాదించగా, వారికి లైజన్ ఆఫీసర్ భాస్కర్‌రావు, మోహన్‌రావు, కోర్టు కానిస్టేబుల్ శశిధర్, హోంగార్డులు ఎస్.డి యూసుఫ్, సీతయ్య సహకరించారు.

263
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles