రూ.15 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Tue,November 12, 2019 02:13 AM

-ముగ్గురు నిందితుల అరెస్టు
పాల్వంచ రూరల్ : నాలుగుసార్లు అక్రమంగా గంజాయి రవాణ చేసిన ముఠా అదృష్టం కలిసి రాక ఐదోసారి పాల్వంచ పోలీసులకు చిక్కారు. ఓరిస్సా నుంయి ఖమ్మంకు అక్రమంగా గంజాయి రవాణ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ డీఎస్సీ ప్రసాదరావు తెలిపారు. సోమవారం సీఐ కార్యాలయంలో డీఎస్పీ ప్రసాదరావు ఏర్పాటు చేసిన విలేకర ్ల సమావేశంలో గంజాయి అక్రమ రవాణ వివరాలను వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రం మల్కాజ్‌గిరి జిల్లా ఎంపీవీ-23 (గ్రామంపేరు)కు చెందిన ముగ్గురు యువకులు గతంలో ఖమ్మంకు కార్లలో గంజాయిని అక్రమంగా రవాణా చేసేవారు. అదే విధంగా శనివారం కూడా ఒక ఇన్నోవా, వెర్టికా కార్లలో 52 గంజాయి ప్యాకెట్లు పెట్టుకుని ఖమ్మంకు బయలుదేరారు. అదే రోజు పాల్వంచ ఇందిరా కాలనీ పెట్రోలు బంకు వద్ద రూరల్ ఎస్సై శ్రీధర్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

ఇతర రాష్ట్ర రిజిష్ర్టేషన్ నెంబర్లు ఉండడంతో కార్లను పక్కన ఆపి తనిఖీ చేయడం ప్రారంభించారు. ఆ తనిఖీల్లో రెండు కార్ల లో సీటు కింద, డిక్కిలో దాచిన 52 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఒకోక్క ప్యాకెటు రెండు కిలోల బరువు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు నిందితులను, కార్ల ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఖమ్మం మార్కెట్‌లో దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులు హేమానంద్ సర్కార్, పిప్లవ్ మండల్, అమృత్ బిస్వాల్‌లను అరెస్టు చేశారు. విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ప్రసాదరావుతో పాటు సీఐ నవీన్, రూరల్ ఎస్సై శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

283
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles