డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

Tue,November 12, 2019 02:12 AM

కొత్తగూడెం అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయం సమావేశ మందిరంలో యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన జాబ్ మేళాలలో 214 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారికి ముఖాముఖి ఇంటర్యూలు నిర్వహించి 34మంది అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది. బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ 23 మంది, ఆఫీసర్స్ 11 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీవో జగత్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

247
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles