ఖమ్మం కల్చరల్ నవంబర్10: ఆధ్యాత్మిక విశ్వ గురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీ గురు విశ్వస్ఫూర్తి మార్గం అనుసరణీయమని పలువురు వక్తలు చాటారు. నగరంలోని ఎస్బీఐటీలో ఆదివారం నిర్వహించిన స్ఫూర్తి కుటుంబ సమావేశంలో పలువురు ప్రముఖులు గురు విశ్వస్ఫూర్తి రచనలను వివరించారు. ఎస్బీఐటీ చైర్మన్ గుండాల కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజంలో సద్గురువుల పాత్ర ఎనలేనిదని, దేశ వ్యాప్తంగా గల విశ్వస్పూర్తి భక్తులు ఉత్తమ జీవనాన్ని ఆచరిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు, కార్యక్రమ నిర్వాహకుడు తుంబూరి దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, నవీన సమాజ స్థాపనే లక్ష్యంగా గురువు విశ్వస్ఫూరి బోధనలుంటాయన్నారు. రైల్వేస్ అధికారి గంగా భవాని, అధ్యాపకుడు సాయిప్రసాద్, శివప్రసాద్‌లు పలు అంశాలపై ప్రసంగించారు. సమావేశంలో నువ్వుల సురేష్, డాక్టర్ ధనాలకోట రామారావు, కానుగుల రాధాకృష్ణ, పిన్నమనేని భానుకృష్ణ, వడ్డెం విక్రం, స్రవంతి, గుంటి ప్రసాద్, బాడిశ వెంకటేశ్వర్లు, సత్యనారాయణరెడ్డి, రాజేష్, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.