సింగరేణి కార్మికుల ఎక్స్‌గ్రేషియా...300 శాతం పెంపు

Mon,November 11, 2019 01:56 AM

కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 10 : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదాల్లో మృతి చెందితే యాజమాన్యం చెల్లించే ఎక్స్‌గ్రేషియా 300 శాతం పెంచుతూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖా మంత్రి ప్రహల్లాద్‌జోషి ప్రకటించారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతం ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులకు రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు. కేంద్ర మంత్రి 300 శాతం పెంచడంతో రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.15 లక్షలు కార్మికులకు చెల్లించనున్నారు. కోలిండియాతో పాటు ఎనిమిది రాష్ర్టాల్లో ఉన్న బొగ్గు, దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఇది వర్తించనుంది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కేంద్ర మంత్రి ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచినప్పటి నుంచి కార్మికుల మ్యాచింగ్‌గ్రాంట్ ఏకంగా రూ.25 లక్షలకు పెంచిన విషయం విధితమే. మ్యాచింగ్ గ్రాంట్‌తో పాటు కేంద్రం నూతనంగా 300 శాతం ప్రకటించడం వల్ల ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబాలకు రూ.15 లక్షలు యాజమాన్యం చెల్లించడంతో పాటు మ్యాచింగ్ గ్రాంట్ రూ.25 లక్షలు కూడా చెల్లిస్తారు. కోలిండియా నుంచి సింగరేణి సంస్థకు విధివిధానాలతో కూడిన జీవో కాపీ రాగానే సింగరేణిలో పెంచిన ఎక్స్‌గ్రేషియా అమలులోకి రానుంది. వీలైనంత త్వరలో సింగరేణిలో పెంచిన ఎక్స్‌గ్రేషియాను అమలు చేసేందుకు కార్మిక సంఘాల నాయకులు కృషి చేయాలని కార్మికులు కోరుతున్నారు.

186
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles