రైతాంగానికి దన్నుగా సహకార వ్యవస్థ

Sun,November 10, 2019 12:08 AM

ఎర్రుపాలెం: సహకార సంఘ వ్యవస్థ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని శఖునవీడు గ్రామంలో శనివారం ఎన్‌ఆర్‌జీఎస్ నిధుల నుంచి రూ.16 లక్షల వ్యయంతో దాత గుర్రాల వెంకటేశ్వరరెడ్డి సోదరులు వితరణ చేసిన స్థలంలో నిర్మించిన నూతన పంచాయతీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండల పరిధిలోని ఇనగాలి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌ను ప్రారంభించిన అనంతరం సభలో వారు మాట్లాడుతూ సహకార వ్యవస్థ ద్వారా రైతాంగానికి అనేక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. గతంలో సొసైటీల్లో రైతు రుణాలకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే నడిచేవన్నారు. కానీ ప్రస్తుతం సొసైటీల ద్వారా రైతాంగానికి ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సబ్సిడీలపై అందించడమే కాకుండా నూతనంగా సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్‌ను కూడా ఇనగాలిలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సహకార వ్యవస్థను పటిష్టం చేసేందుకు తమవంతు సహకారం అందించాలన్నారు.

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా సహకార వ్యవస్థ రైతాంగ సేవలు అందించడంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందుందన్నారు. రైతాంగానికి కావాల్సిన సౌకర్యాలు, అవసరాలు తీర్చడంలో సహకార వ్యవస్థ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ పల్లెల్లో ఉండే రైతాంగం ముంగిట్లోకి ఎరువులు, పు రుగు మందులు, విత్తనాలు తీసుకొచ్చి అందించడంలో సహకార వ్యవస్థ కృషి ఎనలేనిదన్నా రు. అనంతరం మొలుగుమాడులో టీఆర్‌ఎస్ నాయకులు మోదుగుల నాగరాజు మాతృమూర్తి తల్లి అంజమ్మ ఇటీవల మృతిచెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. విద్యావలంటీర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అందించిన వినతిపత్రాన్ని స్వీకరించారు.

ఈ కార్య క్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర ఏఎంసీ వైస్‌చైర్మన్ శీలం వీరవెంకటరెడ్డి, మండల రైతుసమన్వయ సమితి కోఆర్డినేటర్ శీలం వెంకట్రామిరెడ్డి, వైకాస సభ్యురాలు వేమిరెడ్డి త్రివేణి, డీసీసీబీ డైరెక్టర్లు బోజడ్ల అప్పారావు, బ్రహ్మయ్య, సీఈవో వసంతరావు, పీఆర్ డీఈ కే.వీ.కే.శ్రీనివాస్, పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, సర్పంచ్‌లు యరమల విజయభాస్కర్‌రెడ్డి, య రమల వెంకటరెడ్డి, వైస్‌ఎంపీపీ సూరానేని రామకోటేశ్వరరావు, మాజీఎంపీపీ చావా అరుణ, ఎంపీటీసీ పొట్టపింజర నరసింహా, సొసైటీ అధ్యక్షులు వేమిరెడ్డి వెంకటరెడ్డి, నాయకులు పంబి సాంబశివరావు, మూల్పూరి శ్రీనివాసరావు, బాలరాఘవరెడ్డి, సేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

236
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles