కొత్తగూడెం, ఎడ్యుకేషన్: ప్రాజెక్టుల త యారీలో భాగంగా కొత్తగూడెం పాలిటెక్నిక్ విద్యార్థులు సో లార్ సైకిల్ తయారు చేశారు. శనివారం కళాశాల ప్రిన్సిపాల్ నాగమునినాయక్ సోలార్ సైకిల్ త యారు చేసిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సోలార్ సైకిల్ తయా రు చేసేందుకు ఒక పాత సైకిల్, డీసీ మోటర్, మోట ర్ కంట్రోలర్, సోలార్ ప్యానెల్, బ్యాటరీలు, పాత ఇనుప రాడ్లు వాడినట్లు విద్యార్థులు తెలిపారు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు తాకి సోలార్ ప్యానెల్‌పై పడి విద్యుత్ శక్తిగా మారడం వల్ల సైకిల్ నడుస్తుందని విద్యార్థులు వివరించారు. ఎండ లేని సమయంలో అడాప్టర్ ద్వారా చార్జింగ్ చేయవచ్చని, ఈ సైకిల్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఎండాకాలంలో దీని వాడకం వందశాతం ఉంటుందని, కాలుష్యం ఉండదని విద్యార్థులు సాయి, సోహైల్, స్నేహ, కార్తీక్, అభిషేక్, మోహన్, నితిన్ తెలిపారు.