ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) లో నిరుద్యోగ దివ్యాంగలకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు శనివారం టాస్క్ రీజినల్ సెంటర్ మేనేజర్ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఆధ్వర్యంలో ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం ద్వారా శిక్షణను అందిస్తున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11వ తేదీనటాస్క్ రీజినల్ ఆఫీసులో వీడియోస్ కాలనీలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయం ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించను న్నామని పేర్కొన్నారు.
10 వ తరగతి పాస్ లేదా ఆపైన చదువుకొని 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు కలిగిన స్త్రీ, పురుషులు కనీసం 40 శాతం దివ్యంగ ధ్రువీకరణ సర్టిఫికేట్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని తెలిపారు. అర్హులైన వారికి టాస్క్ రీజినల్ సెంటర్లో రెండు నెలలు (ఇంగ్లీష్, రిటైల్, కంప్యూటర్, పర్సనాలిటీ డెవలప్మెంట్) శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి సౌకర్యం ఉంటుం దన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్, ప్రైవేట్ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం 7032777493, 08742-242275లను సంప్రదించాలని సూచించారు.