భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం

Mon,October 21, 2019 01:10 AM

కొత్తగూడెం నమస్తే తెలంగాణ, అక్టోబర్ 20 : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఆకాశం మేఘావృతమై ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో సుమారు అరగంట సేపు భారీ వర్షం కురిసింది. చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల్లో భారీ వర్షం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో మోస్తారుగా వర్షం కురిసింది. అశ్వాపురంలో 24మిల్లీమీటర్ల, చర్లలో 11మి.మీ., కొత్తగూడెంలో 10మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి 4సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారలు తెలిపారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి వేసి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలివేశారు. కొత్తగూడెం పట్టణంలోని అండర్‌బిడ్జ్రి వద్ద భారీగా నీరు చేరడంతో ద్విచక్రవాహనదారులు, పాదాచారులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు.

215
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles