రక్తదానం సామాజిక బాధ్యత : సీపీ

Sun,October 20, 2019 03:56 AM

ఖమ్మం క్రైం, అక్టోబర్ 19: రక్తదానం అనేది సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఖమ్మం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ అవరణలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. శాంతి సమాజ నిర్మాణంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళి అర్పిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజసేవలో పాలుపంచుకోవాలన్నారు. రక్తదాన శిబిరాల వల్ల ప్రమాద సమయంలో ఆపదలో ఉన్న రోగులకు రక్తం అందుతుందని సీపీ తఫ్సీర్ అన్నారు. ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలకు పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు, ఏసీపీలు సత్యానారయణ, విజయబాబు, సీఐ సత్యనారాయణరెడ్డి, ఆర్‌ఐలు నాగేశ్వరరావు, శ్రీనివాస్, రవి, ఆర్‌ఎస్‌ఐ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

203
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles