ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిఒక్కరూ సహకరించాలి

Fri,October 18, 2019 11:11 PM

ఖమ్మం నమస్తే తెలంగాణ : ప్లాస్టిక్ వినియోగం నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా మానివేయాలని జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం నో క్యారీబ్యాగ్ డేను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ మాల్లో ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన పల్దిన్, గుడ్డ సంచులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించిన వ్యక్తులపై రూ. 500లు, వాణిజ్య వ్యాపార సంస్థలపై రూ. 5వేలు వరకు జరిమానా విధించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించరాదని నగర ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

231
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles