పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకం

Fri,October 18, 2019 11:11 PM

పాల్వంచ రూరల్ : మండలంలోని పెద్దమ్మతల్లి దేవాలయంలోని అమ్మవారికి శుక్రవారం అర్చకులు పంచామృతాలతో ఘనంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం ఆలయం ఎదురుగా ఉన్న అమ్మవారి జన్మస్థలం వద్ద మేళ,తాళాలతో పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి ఇష్టమైన పసుపు, కుంకుమ, గాజులు, ఒడి బియ్యం సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూల విరాఠ్‌కు పంచామృతాలతో అభిషేకం జరిపి పూజా కార్యక్రామాల్లో భాగంగా పంచహారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం పూజలు చేసారు. అమ్మవారికి హరతి ఇచ్చే కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు భక్తిశ్రద్దలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు.

215
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles