ప్రభుత్వ వైద్యశాల తనిఖీ..

Fri,October 18, 2019 11:10 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ అక్టోబర్18: భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రాబోయే శీతాకాలంలో వచ్చే స్వైన్ ప్లూను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేయడం పట్ల తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్, స్వైన్ ప్లూ జ్వరాల నివారణ ఉమ్మడి జిల్లా బాధ్యులు డాక్టర్ ఎస్.జయరాంరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఏరియా వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలో ైస్లెన్ ప్లూ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు, ప్రత్యేక విభాగం, వైద్యులు, సిబ్బంది గదులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన వైద్యశాలలో ముందస్తుగా ప్రభుత్వం స్వైన్ ప్లూన్‌ను నియంత్రించేందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్న నేపథ్యంలో భద్రాచలం వైద్యశాలలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.

అనంతరం ఏరియా వైద్యశాలలో అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇతరత్రా వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ఏరియా వైద్యశాల అధికారులు వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత, ఇతరాత్ర సమస్యలను డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టేందుకు కసరత్తు చేపట్టిందని, నెల రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని డిప్యూటీ కమిషనర్ జయరాంరెడ్డి స్థానిక అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా భద్రాచలం ఐటీడీఏ పీవోను ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్ శుక్రవారం సాయంత్రం కలిసి ఏరియా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరతపై మరోసారి విన్నవించినట్లు తెలిపారు.

211
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles