గ్రామాల అభివృద్ధి బాధ్యత సర్పంచ్, కార్యదర్శులదే

Thu,October 17, 2019 11:48 PM

తల్లాడ: గ్రామపంచాయతీల అభివృద్ధి బాధ్యత సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులదేనని, 30 రోజుల ప్రణాళిక స్ఫూర్తితో నిరంతరం గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, డీపీవో హన్మంత్ కొడింబా అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో కొండపల్లి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హన్మంత్ కొడింబా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి ందన్నారు.రెండోవిడత నిధులు కూడా గ్రామపంచాయతీలకు ఒక వారంలో అందనున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, నర్సరీలు, ప్లాస్టిక్ నిర్మూలన వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు.

ఇంకుడుగుంతల నిర్మాణం కోసం ఇళ్లకు సర్వే చేయాలన్నారు. గ్రామాల్లో రోజువారి షెడ్యూల్ ప్రకారం ఎవరికీ అప్పగించిన పనులు వారు నిర్వహిస్తున్నారో లేదా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షించాలన్నారు. గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్ది జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. ప్లాస్టిక్ నివారణలో భాగంగా నిబంధనలు అతిక్రమిస్తే వారికి జరిమానా విధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీ ల, వైస్‌ఎంపీపీ శీలం శివపార్వతి, ఏపీవో కోటయ్య, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

254
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles