రామయ్య సన్నిధిలో వ్యవసాయ శాఖ మంత్రి

Thu,October 17, 2019 11:47 PM

భద్రాచలం,నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని రాష్ట్ర వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురు వారం ఉదయం కు టుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అ ర్చకులు మంత్రికి పరివట్టం కట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థ్ధప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని ను సందర్శించి సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు మంత్రికి ఆలయ, సుదర్శన చక్రం విశిష్టత గురించి వివరించారు. దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు మంత్రికి జ్ఞాపిక అంద జేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

భద్రాచలం చేరుకున్న మంత్రికి స్థానిక బ్రిడ్జీ సెంటర్ వద్ద టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్‌టీసీ కార్మికులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్మికుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మానె రామకృష్ణ, అరికెల్ల తిరుపతిరావు, రత్నం రమాకాంత్, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, మామిడి పుల్లారావు, ప్రేమ్‌కుమార్, కేతినేని లలిత, గంగాభారతి, బషీర్, పీఏసీఎస్ అధ్యక్షుడు సంకా వెంకటనగేష్ తదితరులు పాల్గొన్నారు.

233
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles