అప్రమత్తంగా ఉండండి..

Thu,October 17, 2019 11:47 PM

ఖమ్మం క్రైం: జిల్లాలో శాంతి భద్రతలకు ఆటంకాలు కలగకుండా ప్రతీ పోలీస్ అప్రమత్తంగా ఉండాలని సీఐడీ ఐజీపీ ప్రమోద్ కుమార్ ఏసీపీలను ఆదేశించారు. కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఐడీ ఐజీపీ ప్రమోద్ కుమార్ (ఇన్‌చార్జ్ వరంగల్ రెంజ్ డీఐజీ) జిల్లాలో పర్యటించారు. గురువారం రాత్రి ఉమేష్ చంద్ర భవన్ పోలీస్ గెస్ట్ హౌస్ చేరుకున్న సీఐడీ ఐజీపీని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఏసీపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రమోద్ కు మార్ మాట్లాడారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

ముందస్తు ్త చర్యల్లో భాగంగా ఆర్టీసీ డిపోలు, ప్రధాన బస్టాండ్‌ల్ల వద్ద పోలీస్ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, పోలీస్ బందోబస్తు, పికెట్లను ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సులు తిరిగే రోడ్డు మార్గాల్లోను ప్రత్యేక పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రజలకు అసౌకర్యానికి గురికాకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు చొరవ తీసుకోవాలని సూ చించారు. అనంతరం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్సులు అందుబాటులో ఉంటున్నాయా..? ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా..? అనే విషయాలు పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు, ఎస్‌బీ ఏసీపీ సత్యనారాయణ, ఏసీపీలు వెంకట్రావ్, రామోజీ రమేష్, సదానిరంజన్, రామానుజం, జహంగీర్, రెహ్మాన్ పాల్గొన్నారు.

213
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles