పారిశుధ్యాన్ని నిరంతరం కొనసాగించాలి

Thu,October 17, 2019 12:59 AM

కామేపల్లి: గ్రామాల్లో పారిశుధ్యాన్ని నిరంతరంగా కొనసాగించాలని జిల్లా పంచాయతీ అధికారి హనుమంతు కొండిబా అన్నారు. బుధవారం కామేపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా 30రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణతో చేపట్టిన పనులపై గ్రామాలవారిగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలను పూర్తి చేసి మలవిసర్జన లేని స్వచ్ఛ గ్రామాలుగా గుర్తింపు పొందాలన్నారు. హరితహారంలో గ్రామ పంచాయతీలకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రజలు ప్లాస్టిక్‌ను వినియోగించకుండా ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్య సమస్యలపై వారికి వివరించి ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు వాడకుండా ఉండేలా వారిని చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో ప్రభాకర్‌రావు, ఏపీడీ వెంకటరమణ, ఎంపీడీవో శ్రీరామమూర్తి, ఈవోపీఆర్డీ సత్యనారాయణ, ఏపీవో శ్రీరాణి, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులున్నారు.

234
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles