సమస్యల పరిష్కారానికే..

Thu,October 17, 2019 12:59 AM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ/అశ్వారావుపేట టౌన్: గ్రామాలలో నెలకొన్న సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని, అందులో భాగంగా నివేదన యాప్ ప్రవేశపెట్టిందని జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో తప్పొప్పులు సరిచేసుకునేందుకు ఎన్నికల కమిషన్ ఈ నెల 30 వరకు ఓటర్లుకు అవకాశం ఇచ్చిందన్నారు. అందుకు ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తప్పులను వారే సొంతంగా సరిచేసుకోవాలని తెలిపారు. నివేదన యాప్ ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు 16 శాఖలను యాప్‌లో చేర్చారన్నారు. యాప్ ప్రవేశపెట్టిన 15 రోజులలో ఇప్పటివరకు 2800 సమస్యలు జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి తమ దృష్టికి వచ్చాయన్నారు. వాటిలో 60 శాతం సమస్యలను పరిష్కరించామన్నారు. జిల్లాలో పట్టా పాస్ పుస్తకాలు జారీ దాదాపుగా పూర్తి అయినట్లేనని అన్నారు. జిల్లాలో 1,47,282 ఖాతా నెంబర్‌లు ఉండగా ఇప్పటివరకు 1,15,0091 ఖాతా నెంబర్‌లకు పాస్‌పుస్తకాలు అందించామన్నారు.

మరో 30 వేల ఖాతాలకు పలు సమస్యల కారణంగా 20 కోట్ నెంబర్‌లు ఇచ్చి విచారణ చేపట్టామన్నారు. 15 వేల ఎకరాలు వరకు ఎల్‌టీఆర్, పీఓటీ కేసులుగా గుర్తించామన్నారు. వీటిపై భూమి విచారణ చేపడుతున్నామని వివరించామన్నారు. ఫారెస్టు- రెవెన్యూ శాఖల మధ్య ఉన్న వివాదాస్పద భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నామన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములకు పట్టాలు ఇచ్చేది లేదని, అయినా గతంలో కల్పించిన హక్కు పత్రాలు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలకు ఈ ఆర్‌ఓఎఫ్‌ఆర్ హక్కు దారులు అర్హులుగా ఉంటారని స్పష్టం చేశారు. మండలంలోని గాడ్రాల సమీపంలో అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 16 ట్రాక్టర్లు ఒక జేసీబీని పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ అరుణ, డీటీ విల్సన్, ఆర్.ఐ వెంకటేశ్వరరావు ఉన్నారు.

215
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles