ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిద్దాం..

Wed,October 16, 2019 01:01 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధించేందుకు పాటుపడదామని జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభిలు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ వినియోగపు అంశంలో (క్యారిబ్యాగ్)ను పూర్తిస్థాయిలో నిషేధించాలనే అంశానికి చెందిన వాల్‌పోస్టర్‌ను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో నిషేధించి జౌళి సంచులను ఈ నెల 18వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ వినియోగించుకుని నో క్యార్‌బ్యాగ్ డే సందర్భంగా ప్లాస్టిక్ ఫ్రీ ఖమ్మం నగరంగా తీర్చిదిద్దుకుందామన్నారు. ప్రజలలో చైతన్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

188
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles