కనుల పండువగా సహస్ర చండీయాగం

Wed,October 16, 2019 01:01 AM

కల్లూరు : లోక కల్యాణం కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన సహస్ర చండీయాగం మూడవరోజులో భాగంగా మంగళవారం పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో ఈ తంతు కన్నులపండువగా సాగింది. వేదమంత్రాలతో గ్రామమంతా మారుమోగింది. ఈ సందర్భంగా పొంగులేటి దంపతులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమంలో పాల్గొన్నారు. పీఠాధిపతులు, ఋత్వికుల ఆధ్వర్యంలో యాగశాలలో ఉదయం గురుదేవతా ప్రార్ధన, పుణ్యహవచనం, గణపతిపూజ, మహాసంకల్పం, దేవలంబి యాగశాల సంస్కారం, సహస్ర మోదక గణపతి హవనం, గోపూజ, చండీయంత్ర స్థాపనం, రుద్రపునచ్ఛరణ, చతుర్వేద హవనం ప్రారంభం, సప్తసతీ పారాయణం, సవరణ పూజ, కన్యకాపూజ, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ వంటి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు మాట్లాడుతూ లోక కల్యాణం కోసం చేస్తున్న యాగం వల్ల అమ్మవారి కృప ఎల్లవేళలా లభిస్తుందన్నారు. అనంతరం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు యాగానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ యాగానికి హాజరైన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వలంటీర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుంకుమ పూజలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై పూజల అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి యాగానికి హాజరుకావడంతో ఆయనకు పొంగులేటి ఘనంగా స్వాగతం పలికి యాగశాల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తెలుగు రాష్ర్టాల ప్రజల సుభిక్షం కోసం యాగం చేస్తున్న పొంగులేటి సోదరులను ఆయన అభినందించారు. యాగానికి హాజరయ్యే భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని దిశ జిల్లా కమిటీ సభ్యుడు దయానంద్ విజయ్‌కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. కల్లూరు ఏసీపీ వెంకటేశ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాగంలో పాల్గొన్న ప్రముఖులు
సహస్ర చండీయాగంలో మంగళవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు భద్రాచలం దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, దిశ కమిటీ జిల్లా సభ్యుడు మట్టా దయానంద్ విజయ్‌కుమార్, తుమ్మూ రు దయాకర్‌రెడ్డి, కీసరి వెంకటేశ్వరరెడ్డిలతో పాటు జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు.

207
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles