మైనర్ బాలికపై లారీ క్లీనర్ కామ పైశాచికం

Tue,October 15, 2019 01:01 AM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: లారీ క్లీనర్‌గా పని చేస్తున్న ఒక యువకుడు మానవత్వం మరిచి పసి బాలికపై కామ పైశాచికానికి పాల్పడ్డాడు. జ్వరంతో ఇంట్లోనే ఉన్న బాలికను సదరు యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన బాలిక తల్లి చూసి కేకలు వేసింది. దీంతో నిందితుడు అక్కడ నుండి పారిపోయాడు. సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక తల్లి ఫిర్యాదుతో సోమవారం పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ మధు ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఓ బజారుకు చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 2వ తరగతి చదువుకుంటున్నది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో సమీపంలోనే నివాసం ఉంటున్న లారీ క్లీనర్ బాలగొమ్మి సాయి (23) లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ దుశ్చర్యను చూసిన తల్లి కేకలు వేయటంతో నిందితుడు సాయి పరారయ్యాడు. వెంటనే 100నెంబర్‌కు డయల్ చేసి జరిగిన సంఘటనపై తల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై వివరాలు సేకరించిన అనంతరం బాలికను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి నిందితుడు సాయిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ, లైంగిక దాడి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

228
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles