గిరిబజార్‌లతో గిరిజన కుటుంబాలకు ఉపాధి

Tue,October 15, 2019 01:00 AM

మణుగూరురూరల్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకే గిరిబజార్‌లను ఏర్పాటు చేస్తున్నామని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. ఆయన సోమవారం మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో జీసీసీ ద్వారా ఐటీడీఏ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన గిరిజన సూపర్‌బజార్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీసీసీ ద్వారా కొనుగోలు చేసి సూపర్‌బజార్ ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు విక్రయించి గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కేవలం గిరిజన మహిళ సొసైటీలను మాత్రమే ఇందులో భాగస్వాములను చేస్తున్నామన్నారు.

కంది పప్పు తయారుచేసే యూనిట్‌ను అశ్వారావుపేటలో ప్రారంభిస్తున్నామని, కేంద్రప్రభుత్వం అందించే రూ. 40లక్షల గ్రాంటుతో మిరప, పసుపుపొడి యూనిట్‌లను ఇల్లందులో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, జీసీసీ డీఎం వాణి, తహసీల్దార్ మంగీలాల్, సర్పంచ్ బచ్చలభారతి, ఈఈటీడబ్ల్యూ రాములు, ఏఈ దీపాంజలి, జీసీసీ బ్రాంచి మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

165
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles