సంక్షేమ పథకాలే సైదిరెడ్డిని గెలిపిస్తాయి..

Tue,October 15, 2019 12:59 AM

-హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న
-ఎంపీ నామా నాగేశ్వరరావు, రూరల్ నాయకులు..
ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, అక్టోబర్ 14 : దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి సైదిరెడ్డిని అఖండ మోజార్టీతో గెలిపిస్తాయని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హుజూర్‌నగరల్‌ని టీఆర్‌ఎస్ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో ఎంపీ నామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థి సైదిరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికుట్రలు చేసినా గెలిచేది టీఆర్‌ఎస్ అభ్యర్థి మాత్రమే అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజల రాతలు మారాలంటే టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే లాభం కంటే నష్టం ఎక్కువన్నారు.

గతంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే చేసింది శూన్యం అని ఈ సారి టీఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుతాయన్నారు. ని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రచారంలో ప్రజల నుంచి అనుహ్యస్పందన లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనం అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అర్హులైన పేదలకు న్యాయం జరిగిదే తెలంగాణ ప్రభుత్వంలోనే అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, వైస్ ఎంపీపీ దరగయ్య, ఎంపీటీసీ గొడ్డుగోర్ల వెంకటేశ్వర్లు, వెంకటనారయణ, మట్టా వెంకటేశ్వర్లు, వెంపట రవి, సతీష్, రఘు తదితరులు ఉన్నారు.

149
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles