చరిత్రకెక్కని సమరం తలవంచని నాగులవంచ పుస్తకావిష్కరణ

Mon,October 14, 2019 03:27 AM

చింతకాని:మండలంలో నాగులవంచ గ్రామంలో చరిత్రకెక్కని సమరం తలవం చని నాగులవంచ అనే పుస్తకాన్ని బీసీ కమిషన్ సభ్యులు, ప్రముఖ రచయిత జూలూరు గౌరీశంకర్, పుస్తక రచయిత కట్టా శ్రీనివాస్‌లు ఆవిష్కరించారు. ఈ సందరంగా గౌరీశంకర్ మాట్లాడుతూ 16వ శతాబ్దంలో నాగులవంచ గ్రామంలో జరిగిన యదార్థ ఘటనలను రచయిత పుస్తక రూపంగా చక్కగా వివరించారన్నారు. బ్రిటీష్ వారి కంటే ముందు గ్రామానికి డచ్చివారు రాగా వారిని గ్రామంలో యువకులు పారదోలిన విధానం ఉన్నదని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమన్నారు. అక్టోబర్ 13న గ్రామస్తులు డచ్చివారిని పారదోలడంతో ఇదే రోజు పుస్తకావిష్కరణ జరపడం ఆనందంగా ఉన్నదని ఆయన పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆలస్యం నాగమణి, వంకాయలపాటి సత్యనారాయణ, వెంకటలచ్చయ్య, అంబటి ఆనందరావు, మునుకుంట్ల సుబ్బారావు, అంబటి సైదేశ్వరరావు, ఆలస్యం బసవయ్య, కొల్లి బాబు, రౌతు అప్పారావు, గ్రామపెద్దలు, మేధావులు, కవులు పాల్గొన్నారు.

204
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles