హైదరాబాద్‌లో రొట్టమాకురేవు కవిత్వ అవార్డు ప్రదానోత్సవం

Mon,October 14, 2019 03:26 AM

కారేపల్లి రూరల్, అక్టోబర్12:రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని రొట్టమాకురేవుకు చెందిన కవి యాకుబ్ రొట్టమాకురేవు కవిత్వ అవార్డుపేరుతో ఉత్తమ కవితా సంపుటాలకు అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమాన్ని గత ఐదేళ్లుగా గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. రొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2019కు ముగ్గురు కవులను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేశారు. షేక్ మహ్మద్‌మియా మెమోరి యల్ పోయట్రీ అవార్డును ఆకాశం కోల్పోయిన పక్షి రచనకు కృష్ణుడు, కె.ఎల్. నర్సింహారావు మెమోరియల్ పోయట్రీ అవార్డుకు ఒక... రచనకు సిద్ధార్థ కట్టా, పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డుకు అంగార స్వప్నం రచనకు ఊర్మిళను ఎంపిక చేశారు.

ఇదే వేదికపై కవి యాకూబ్ ఐదోవ కవితా సంపుటి తీగలచింతను కూడా ఆవిష్క రించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ కవి శివారెడ్డి మాట్లాడుతూ...పల్లెలు సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాలనే సంకల్పంతో కవి యాకూబ్ తన స్వగ్రామమైన రొట్టమాకురేవులో వివిధ కార్య క్రమాలను గత ఐదేళ్లుగా చేపట్టడం అభినందనీయమన్నారు. చిన్న పల్లెటూరైన రొట్టమాకురేవులో యాకూబ్ లైబ్రరీని ఏర్పాటుచేసి వేలాది పుస్తకాలను ఆ గ్రంథాలయంలో ఏర్పాటు చేసి చేపడుతున్న కార్యక్రమాలు సాహితీ ప్రియులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్, కె. శ్రీనివాస్, కవులు దేవీప్రియ, శిలాలోలిత, ప్రసేన్ తదితరులు పాల్గొన్నారు.

171
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles