నేటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో

Mon,October 14, 2019 03:26 AM

-హిందూ ధర్మ ప్రచారయాత్ర
ఖమ్మం, నమస్తే తెలంగాణ : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా సోమవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. ధర్మప్రచార యాత్రలో భాగంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి ఖమ్మం నగరం, బుర్హాన్‌పురంలోని వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) నివాసంలో శ్రీ రాజశ్యామల దేవికి స్వయంగా పీఠపూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహభాషణం ఇస్తారు. అలాగే అక్టోబర్ 18, శుక్రవారం నాడు ఖమ్మం నగరంలోని రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్‌లో గాయత్రి రవి, విజయలక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు జగద్గురు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తారాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లకు పుష్పాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివార్ల ఆశీస్సులు పొందవలసిందిగా గాయత్రి రవి దంపతులు విజ్ఞప్తి చేశారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉత్తరా ధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి కూసుమంచి గణపేశ్వర ఆలయం, ఖమ్మం నగరంలోని గుంటు మల్లేశ్వర స్వామి గుడి, స్తంభాంద్రి లక్ష్మీ నరసింహాస్వామి గుట్టను, ప్రఖ్యాతి గాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయాలను దర్శిస్తారు. ఇప్పటికే స్వామిజీ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందూ ధర్మ ప్రచారయాత్రకు నిమిత్తం తొలిసారిగా అక్టోబర్ 14 న ఖమ్మం నగరానికి విచ్చేస్తున్న శ్రీ స్వాత్మానందేంద్రకు ఘనస్వాగతం పలికేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం, ఖమ్మం భక్తులు సన్నద్ధం అవుతున్నారు.

177
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles