ఎస్టీ రిజర్వేషన్‌ అమలుపై అపోహలు వద్దు

Sat,October 12, 2019 11:48 PM

కూసుమంచి:ఎస్టీ రిజర్వేషన్‌ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే వాదనలు వస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని ఎప్పటికీ సమర్దించబోదని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ స్పష్టంచేశారు. కూసుమంచిలోని ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో శనివారం జరిగిన లంబాడాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్‌ నుంచి తొలగిస్తారనే అపోహలు వీడి, నిశ్చింతగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కొందరు కోయ, గోండ్వాన జాతుల వారు తామే అసలైన ఆదివాసీయులమనే వాదనలు తెస్తున్నారని, దీనిపై గిరిజన ఎమ్మెల్యేలందరూ ఆయా వర్గాలను సమన్వయపర్చి సమస్యను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపట్టామని వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం తెలంగాణా లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. గిరిజనులు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని గుర్తుచేశారు. రిజర్వేషన్‌ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్నారు. తెలం గాణ ఉద్యమంలో లంబాడీలు కూడా పాల్గొన్నారని గుర్తుచేశారు.గడిచిన ఆరేళ్లలో తెలంగాణాలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథ కాలు అమలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గుర్తుచేశారు.గిరిజన తండాలన్నీ పంచాయ తీలుగా మార్చి, ఎన్నికలు నిర్వహించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టంచేశారు. గత జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 23 వేలమంది గిరిజనులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారని తెలిపారు. మాజీ మంత్రి రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ... తమ పోరాట ఫలితంగా 1976లో లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్‌ లభించిందన్నారు. రాజ్యాంగంలో 342వ సెక్షన్‌ ప్రకారం లంబాడీలను తొలగిం చడం గానీ, మార్పులు, చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనులకు 9.8 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని 2017లోనే కేంద్రప్రభుత్వం, హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

తండాల్లో చైతన్యం రావాలి: లక్ష్మణ్‌ నాయక్‌
తెలంగాణలో ఉన్న10,500 మారుమూల గిరిజనతండాల్లోని ప్రజ ల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని కేరళ రాష్ట్ర ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌నాయక్‌ అన్నారు. లంబాడీలు వలసవాదులు కాదని మూల వాదులని స్పష్టంచేశారు. తమను వలసవాదులుగా ఆరోపణలు చేస్తున్న కోయలు, గోండ్యానాలే ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి వలస వచ్చారని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్‌ నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్‌ను తిప్పికొడుతూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ను సాధించుకోవడానికి అందరూ ఐక్యంగా నిలివాలని తెలిపారు. లోక్యాతండా ఎంపీటీసీ జర్పుల బాలాజీ నాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో కూసుమంచి, తిరుమలాయపాలెం ఎంపీపీ బానోత్‌ శ్రీనివాస్‌, బోడా మంగీలాల్‌ , లంబాడా సంఘాల నాయకులు బెల్లయ్యనాయక్‌, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, వీరభద్రం , భిక్షం, సోమ్లా, వెంకట్రావ్‌, శ్రీనివాస్‌ , మాజీ జడ్పీటీసీలు వడ్త్యా రామచంద్రునాయక్‌, తేజావత్‌ భారతి, ఖమ్మం కార్పొరేటర్‌ రామ్మూర్తి నాయక్‌, రుక్మిణీబాయి, వినోదబాయి పాల్గొన్నారు.

186
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles