ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

Sat,October 12, 2019 12:01 AM

వైరా, నమస్తేతెలంగాణ : నూతనంగా ఎన్నికైన అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. టీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నియోజకవర్గంలోని 5 మండలాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మండల కమిటీలను ఎమ్మెల్యే ప్రకటించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మండల కమిటీ వివరాలను వెల్లడించారు. వైరా మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పసుపులేటి మోహన్‌రావు, అమరనేని మాధవరావు, కొణిజర్ల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కోసూరి శ్రీనివాసరావు, ఏలూరి శ్రీనివాసరావు, ఏన్కూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బానోత్ సురేష్, స్వర్ణ ప్రహ్లదరావు, జూలూరుపాడు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చౌడం నరసాంహారావు, నున్నా రంగారావు, కారేపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తోటకూర పిచ్చయ్య, అజ్మీర వీరన్నలను ఎంపిక చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో 139 గ్రామాల కమిటీలను నియమించారు.

ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని మండలాల, గ్రామాల కమిటీలను టీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ ఆమోదించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీను మరింత బలోపేతం చేసేందుకు నూతన మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. నూతన కమిటీలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీ మండల, గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మిగిలిన కమిటీ సభ్యులతో సమన్వయంతో పనిచేసి పార్టీకు మంచి పేరు తీసుకురావాలన్నారు. నియోజకవర్గంలోని మండల, గ్రామ కమిటీలను ఆమోదించిన రాష్ట్ర పార్టీకు, సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు, ఇతర ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే రాములునాయక్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమను మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నియమించిన సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు, అందుకు కృషి చేసిన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌కు ఐదు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు.

187
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles