న్యాయసేవా శిబిరాన్ని సక్సెస్ చేయండి

Sat,October 12, 2019 12:00 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 11: వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి ఈ నెల 19న జరగబోయే న్యాయసేవల శిబిరాన్ని విజయవంతం చేయాలని జడ్జీ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. 19న జరగబోయే సమావేశం ప్రభుత్వ పథకాలపైనే కేంద్రీకృతమై ఉందని అన్నారు. కాబట్టి అధికారులు సహకారం అందించాలని కోరారు. ఆయా శాఖలు తమతమ స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దాంతోపాటు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు. సోమవారం సాయంత్రం జిల్లా జడ్జీ, జిల్లా కలెక్టర్‌లు తిరిగి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారని అన్నారు. ఈ సమావేశానికి అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితర శాఖల ఆధికారులు పాల్గొన్నారు.

187
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles