రండి.. యాగఫలం పొందండి..

Sat,October 12, 2019 12:00 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 11: లోక కల్యాణార్థం నిర్వహించే చతుర్వేద స్వాహాకార పురస్పర రుద్ర హవన సహిత సహస్ర చండీ యాగంలో పాల్గొని పుణ్యఫలం పొందాలని శృంగేరీ పీఠం పండితులు విరివింటి ఫణి శశాంకశర్మ, వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ కోరారు. ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జగన్మాత చండీకా పరమేశ్వరి ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని వివరించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న చండీయాగాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించ తలపెట్టడం తెలుగు రాష్ర్టాల ప్రజల అదృష్టమని అన్నారు. ఈ యాగంలో చండీకా పరమేశ్వరి మూలమంత్రాన్ని ఏకోత్తర వృద్ధిగా పారాయణం చేస్తామన్నారు. శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్థమహాస్వామి, విధుశేఖర భారతీస్వామి సంపూర్ణ కరుణ కటాక్ష వీక్షణాలతో కొనసాగే ఈ యాగం అపూర్వ ఫలాలను అందిస్తుందని ఉపదేశించారు. ఈ యాగం హూమ ధూపంతో సకల రోగాలు నివారించుకోవచ్చన్నారు. ఈ యాగంతో వర్షాలు సకాలంలో కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు. ఈ సమావేశంలో పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

203
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles