గిరిజనులకు రిజర్వేషన్లు అమలుచేయాలి

Sat,October 12, 2019 12:00 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 11: షెడ్యూల్డ్ ఏరియాలో స్థానికంగా నివాసం ఉంటున్న గిరిజనులకు వారి పూర్వికుల ఆధారాలను బట్టి రిజర్వేషన్లు అమలుచేయాలని ఏజెన్సీ మండలాల తహసీల్దార్లను ఐటీడీఏ పీవో గౌతమ్ ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఏజెన్సీ మండల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల అమలుపై ఖమ్మం జేసీ అనురాగ్ జయంతితో కలిసి మండలాల వారీగా పీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 నుంచి గిరిజనుల పెద్దల పేరు మీద భూములుండి, వారికి సంబంధించిన సంతతి వారు ఆ భూములపై ఆధారపడి ఉండి, ఏ కారణం చేతనైనా అమ్ముకుంటే ఆ భూమిపై గిరిజనులకు మాత్రమే హక్కు ఉంటుందని అన్నారు. ఒకవేళ గిరిజనేతరులు కొనుగోలు చేస్తే అది చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన సమాచారం సంబంధిత తహసీల్దార్ల వద్ద ఉండాలని ఆదేశించారు. గిరిజనులకు సంబంధించిన డాక్యుమెంట్లు నిజమని నిర్థారణ అయితే, ఆ కుటుంబంలో లేని యువతులకు కానీ, మహిళలకు కానీ ఉద్యోగాలు వస్తే అన్ని శాఖలలో రిజర్వేషన్ కల్పించి అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్‌డీవో బీ.శివాజీ, ఏవో భీము, టీసీఆర్ డిపార్ట్‌మెంట్ శ్రీనివాస్, డీఎంహెచ్‌వో, జేవో అగ్రికల్చరల్, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

177
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles