గ్రామాల అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి

Sun,September 15, 2019 12:36 AM

-జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు
మధిరరూరల్: గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని ఇల్లూరు, నాగవరప్పాడు గ్రామాల్లో 30 రోజుల గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలని, పల్లెలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం పురోగమనం చెందుతుందని భావించి సీఎం కేసీఆర్ గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములై తమతమ గ్రామాలను అభివృద్ధి చేసుకొని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రజాప్రతి నిధులు, గ్రామస్పెషల్‌ఆఫీసర్లు, సిబ్బంది గ్రామంలో పాదయాత్ర చేస్తూ సమస్యలను గుర్తించి ప్రజలకు వివరిస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు.

అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల స్పెషల్‌ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు, పలుఅభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆత్కూరు గ్రామంలో 30 రోజుల పనులను ఎంపీడీవో రేవతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర ఏఎంసీ వైస్‌చైర్మన్ శీలం వీరవెంకటరెడ్డి, మండల కార్యదర్శి చిత్తారు నాగేశ్వరరావు, నాయకులు శీలం వెంకటరెడ్డి, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, మూరబోయిన ప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్పెషల్‌ఆఫీసర్లు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

160
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles