పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం

Sun,September 15, 2019 12:36 AM

ఎర్రుపాలెం: పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని, ప్రతీ ఒక్కరు తమ ఇంటి పరిసరాలతో పాటు, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనికలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. శనివారం ఎర్రుపాలెం మండలం శఖునవీడు గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి పర్యటించారు. గ్రామప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర చేసి గుర్తించిన సమస్యలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ యరమల విజయ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి గ్రామస్తులు తోడ్పాటునందించాలని తెలిపారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంపై అంగన్‌వాడీ, ఆశాకార్యకర్తలు గ్రామప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించి పోషకాహార లోపం, రక్తహీనతను గుర్తించిన వారికి తగు వైద్యం అందించాలన్నారు. గ్రామసభలో పోషణ్‌అభియాన్‌పై ప్రతిజ్ఞ చేయించారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ప్రజలకు అవసరమైన మొక్కలు ఇంట్లో నాటడంతో పాటు, రోడ్డుకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు.

విద్యుత్‌కు సంబంధించిన సమస్యలను గుర్తించి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామంలోని ఇంటిని సందర్శించి ఇంట్లో నిరుపయోగంగా ఉన్న డ్రమ్ములు, సంపులు, గాబులు, కూలర్లు, టైర్లలో, కొబ్బరిబోండాలలో నీరు నిల్వ ఉంచరాదని, నీటి నిల్వలు ఉన్నైట్లెతే దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. ఇంట్లో పరిశుభ్రత పాటించడం ద్వారానే అందరూ ఆరోగ్యకరంగా ఉంటారని, లేకపోతే దోమలు వ్యాప్తిచెంది విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లెసీమలను పరిశుభ్రత, పచ్చదనంగా మార్చేందుకు నెలరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్చంధ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై గ్రామంలోని పరిసరా లన్నింటినీ పరిశుభ్రత, పచ్చదనంతో మెరిసేలా కృషిచేసి నిర్దేశించిన 30 రోజుల్లో గ్రామాభివృద్ధిని సాధించి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని తెలిపారు.

గ్రామంలో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు ముమ్మరం చేయాలని, ము రుగుకాలువల్లో చెత్తాచెదారంను తొలగించి స్ప్రేయింగ్ చేయాలని గ్రామపంచాయతీ అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డు, శశ్మానవా టికను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, ఏఎంసీ వైస్‌చైర్మన్ శీలం వీరవెంకటరెడ్డి, భద్రాచలం ట్రస్టుబోర్డు మాజీచైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ శీలం కవిత, ఎంపీపీ దేవరకొండ శిరీష, వైస్‌ఎంపీపీ రామకోటేశ్వరరావు, తహసీల్దార్ మొహ్మద్‌రియాజ్‌అలీ, ఏఈ శంకర్, ఎంపీడీవో బీ.భద్రు, రైతుసమ న్వయ సమితి మండల కన్వీనర్ శీలం వెంకట్రామిరెడ్డి, సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు వేమిరెడ్డి త్రివేణి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

159
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles