భార్యాభర్తల సమస్యలు కౌన్సెలింగ్‌తో పరిష్కరించాలి..

Sat,September 14, 2019 12:12 AM

-ఫిర్యాదుదారులకు రసీదు ఇవ్వాలి : సీపీ
ఖమ్మం క్రైం : భార్యభర్తల సమస్యలను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారం చూపాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. శుక్రవారం ఖమ్మం మహిళ పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. సున్నితమైన అంశాలకు పోలీస్ కేసుల వరకు వెళ్లి సమస్య పెద్దది చేయకుండా సామరస్య పరిష్కారానికి ఇరు కుటుంబాలు తోడ్పాటు అందించి భార్యభర్తలు కలిసి సంతోషంగా ఉండాలనే భరోసా కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్‌లో రిసెప్షనిస్టులు కీలకమైన బాధ్యతలను కలిగి ఉండాలన్నారు. ఫిర్యాదుదారుల అత్మగౌరవనికి భగంకలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదుదారులకు ఖచ్చితంగా రశీదు ఇవ్వాలని, అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే విధమైన పోలీసులు ఏకీకృత సేవలు అందించాలన్నారు.

కేసుల నమోదు విషయంలో తాత్సారం చేయకుండా, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, ఎస్‌హెచ్‌వో రూం, రికార్ట్స్ రూం, రైటర్స్ రూం, సిబ్బంది విశ్రాంతి గది స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో పోలీస్‌లు స్పందించే తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. కోర్టు డ్యూటీ, ఆఫిసర్లు కోర్టు మానిటర్ సిస్టంలో కేసులును రోజు వారి సమాచారం విధిగా అప్‌లోడ్ చేయాలని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అంజలిని అదేశించారు.

153
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles