సాయి మందిరంలో మంత్రి అజయ్ పూజలు..

Sat,September 14, 2019 12:11 AM

-పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ
రఘునాథపాలెం, సెప్టెంబర్13: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు శుక్రవారం ఖమ్మం నగరం 8వ డివిజన్ మధురానగర్‌కు చెందిన సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పువ్వాడ దంపతులను ఆలయ కమిటీ బాధ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో పలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కూరాకుల నాగభూషణం, ఆలయ కమిటీ చైర్మన్ వల్లభనేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కూరాకుల వలరాజు, 10వ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ, యాదవ సంఘం బాధ్యులు మొర్రిమేకల కోటయ్య, బొమ్మిడి శ్రీనివాస్ యాదవ్, సత్తి గోపాలరావు, కొత్తగూడెం మాజీ వార్డు సభ్యుడు షేక్ సుల్తాన్, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

159
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles