వినాయక నిమజ్జనంలో అపశృతి

Thu,September 12, 2019 12:20 AM

-కాల్వలో పడి వ్యక్తి మృతి
కొణిజర్ల, సెప్టెంబర్11: వినాయక నిమజ్జనంలో అపరిశృతి చోటు చేసుకుంది. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు బీబీసీ కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన తనికెళ్లలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. తనికెళ్లలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని స్థానికులు సమీపంలో బీబీసీ కాల్వలో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. తోటి భక్తులతో పాటు, తనికెళ్లకు చెందిన లకావత్ నాగ (33) కాల్వలో నిమజ్జనం చేస్తుండగా విగ్రహంతో పాటు ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయాడు. నాగ మునిగిపోతున్న విషయాన్ని గమనించిన స్థానికులు బయటకు తీయగా అప్పటికే మృత్యువాతపడ్డాడు. ఇదిలా ఉండగా నాగ మృతి ప్రమాదవశాత్తు కాదని, ఇందులో కుట్ర దాగి ఉందని కుటుంబసభ్యులు ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై చిలివేరు యల్లయ్య మృతదేహాన్ని సందర్శించి పంచనామా నిమిత్తం ఖమ్మం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

213
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles